పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల్లోకి చొచ్చుకెళ్ళిన ఆల్-ఖైదా; విలేఖరి పరిశోధన

ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు…