గంజాయివనంలో తులసి: పుట్టే ప్రతి ఆడపిల్లకి 111 చెట్లు నాటే గ్రామం

భారత దేశంలో చెడబుట్టిందీ గ్రామం. మందీ మార్బలం అంతా చేతుల్లో ఉంచుకుని కూడా ‘మహిళా సాధికారత’ విషయంలో మాటలు తప్ప చేతల్లోకి వెళ్లని ప్రభుత్వాల నిష్క్రియా సంస్కృతి ఎల్లెడలా వ్యాపించి ఉన్న రోజుల్లో ఈ గ్రామం తనదైన పర్యావరణ-స్త్రీవాదాన్ని (Eco-feminism) పాటిస్తోంది. ఆడోళ్లపై ఫ్యూడల్ అహంభావం, అణచివేత, చిన్న చూపు విస్తృతంగా వ్యాపించి ఉండే రాజస్ధాన్ రాష్ట్రంలోనే ఈ వింత చోటు చేసుకోవడం విశేషం. గత అనేక సంవత్సరాలుగా పిప్లాంత్రి గ్రామ ప్రజలు ఆడపిల్లలను జాగ్రత్తగా సాకడమే…