జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…