అన్నా: ఇంకా కొత్త మెరుగైన దీక్ష -కార్టూన్
“ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం, ఇంకా కొత్తది, మెరుగైనది, మీ కోసం. ఇక పాత దానిలోని @#$% అన్నీ ఇట్టే మాటు మాయం. తళతళలాడే కొత్తది… కేవలం మీ కోసం.” టి.వీల్లోనూ, సినిమాకి ముందూ మనకోసం అంటూ మనల్ని ఇబ్బంది పెట్టే ఇలాంటి యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! మన జీవితాల్ని ఎంతో సుఖమయం చేస్తున్నామనీ, అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నామని చెప్పని కంపెనీకి మార్కెటింగ్ మెళకువలు తెలియనట్లే లెఖ్ఖ! ఆ రకంగా మన ఓపికని పరీక్షించడమే కాక చమురు కూడా…

