2జి కుంభకోణానికి ‘తెలంగాణ డిమాండ్’ అడ్డు చక్రం, కాంగ్రెస్ వ్యూహం

పాలక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం అపారం. ఏ బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో, ఏ ఆందోళననను ఎలా తప్పించుకోవాలో, ఏ సంకటం నుండి ఎలా బైటపడాలో కాంగ్రెస్ పాలకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారాయి. ఓవైపు తాము నిండా మునిగి ఉన్న కుంభకోణాలకు సమాధానం చెప్పుకోవలసి ఉండగా, మరొక వైపు అంతర్జాతీయ పెట్టుబడుదారులనుండీ,…