2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

సైన్యం కనుసన్నల్లో పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం -కార్టూన్

శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ…

మన్మోహన్ ప్రభుత్వానికి బరువవుతున్న చిదంబరం -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న పి.చిదంబరం పై ‘అక్రమ ఎన్నిక’ కేసు కొనసాగించడానికి మద్రాసు హై కోర్టు నిర్ణయం తీసుకుంది. తన ఎన్నికపై పిటిషన్ ని కొట్టివేయాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దానితో కేంద్ర మంత్రిగా చిదంబరాన్ని కొనసాగించాలా లేదా అన్నది మన్మోహన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అవసరాన్ని ప్రధాని గుర్తించాడో లేదో గానీ, గుర్తించకపోతే పుటుక్కున తెగి నెత్తిపైనే పడడం ఖాయంగా కనిపిస్తోంది.లేదంటే, రాజీనామా చేయాలన్న బి.జె.పి డిమాండ్…