భారత్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు, ప్రతీకారమే కారణం
పాకిస్ధాన్ కి చెందిన హ్యాకర్లు భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీలు, విభాగాల వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. భారత హ్యాకర్లు పాకిస్ధాన్ ప్రభుత్వ కంప్యూటర్లను పలుమార్లు హ్యాకింగ్ చేస్తున్నాయనీ, అందుకే తాము భారత ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ చేస్తున్నామని వారు ప్రకటించారు. దాదాపు ఎనిమిది ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ కి గురయినట్లుగా తెలుస్తోంది. హ్యాకింగ్ చేసిన వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించారని ‘ది హిందూ’ తెలిపింది. పాకిస్ధాన్ హ్యాకర్ తననుతాను ‘khantastic…