పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం
పాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది.…
