పాక్ ప్రభుత్వానికి ఆర్మీ తీవ్ర హెచ్చరిక
పాకిస్ధాన్ లో ప్రభుత్వమూ, సైన్యా ల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇరు పక్షాల విభేధాలు వివిధ రూపాల్లో రచ్చకెక్కుతున్నాయి. మరోసారి పౌర ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యడానికి ఆర్మి తన చర్యలను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని పదవినుండి తొలగించి ప్రభుత్వంతో అమీ, తుమీ కి సిద్ధపడింది. పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను పాక్ ప్రధాని తీవ్రంగా విమర్శించడంతో సైన్యం వైపునుండి వరుస చర్యలు కనిపిస్తున్నాయి. “మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను…
