పాకిస్ధాన్ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర -ప్రధాని గిలాని

దేశంలో ఏ సంస్ధ కూడా రాజ్యంలో మరొక రాజ్యంగా ఉండజాలదని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ బుధవారం హెచ్చరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కుట్రలు జరుగుతున్నాయని గిలానీ ఆందోళన వ్యక్తం చేసాడు. పాక్ ప్రధాని గిలాని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొద్ది వారాల క్రితం అధ్యక్షుడు జర్దారీ, అమెరికా ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి రాశాడని భావిస్తున్న మెమో లోని అంశాలను ధృవ పరచడం గమనార్హం. అమెరికా…