బాల్యం లేని పాకిస్తాన్ బాల్యం -ఫోటోలు
పాకిస్తాన్ బాల్యం అనగానే మనకి ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మలాలా యూసఫ్జాయ్. తాలిబాన్ ఆదేశాలను ధిక్కరించి బాలికా విద్యకోసం పోరాడుతున్న బాలికగా ఆమె పేరు ప్రపంచం అంతా మారుమోగేలా చేయడంలో పశ్చిమ పత్రికలు రాత్రనకా పగలనక శ్రమించాయి. నోబెల్ శాంతి బహుమతికి కూడా ఆమె పేరు ప్రతిపాదించి కొందరు సంతోషించారు. కానీ ప్రపంచం విస్మరించిన పాకిస్తాన్ బాల్యం మలాలాకు మించినది. పాకిస్తాన్ లోని అసలు బాల్యం అనేక సమస్యలకు ఎదురీదుతూ గ్యారంటీ లేని భవిత…
