పాకిస్ధాన్ లో నిశ్శబ్ద (సైనిక) కుట్ర?

పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ గుండె నొప్పి తో దుబాయ్ ఆసుపత్రిలో చేరడంతో పాకిస్ధాన్ లో నిశ్శబ్ద కుట్ర జరుగుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘మెమో గేట్’ కుంభకోణం దరిమిలా పౌర ప్రభుత్వానికీ, సైన్యానికి మధ్య విభేధాలు తీవ్రమైనాయన్న వార్తల నేపధ్యంలో తాజా కుట్ర వార్తలు బలం సంపాదించుకున్నాయి. సైన్యం ఒత్తిడి మేరకు పదవి నుండి రాజీనామా చేయడం కోసమే దుబాయ్ ఆసుపత్రిలో జర్దారీ చేరాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జర్దారీ ప్రతినిధులు మాత్రం కుట్ర…