అమెరికాతో ఘర్షణ నేపధ్యంలో పాకిస్ధాన్ కి పూర్తి మద్దతు హామీ ఇచ్చిన చైనా
దక్షిణాసియాలో అమెరికాకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న పాకిస్ధాన్ కి అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపధ్యంలో ఆ దేశానికి చైనా నుండి పూర్తి మద్దతు లభించింది. ఆర్ధిక, రక్షణ తదితర రంగాలన్నింటిలోనూ చైనా పాకిస్ధాన్ కి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పాకిస్ధాన్ పర్యటిస్తున్న చైనా అత్యున్నత విదేశాంగ శాఖ అధికారి హామి ఇచ్చినట్లుగా ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ కౌన్సిలర్ దాయి బింగ్-గువో, తన పాక్ పర్యటన పాక్, చైనా సంబంధాలను మరింత ఉన్నత స్ధాయికి…