అమెరికా రాయబారి రాకను వద్దన్న పాక్

అమెరికా ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్‌మన్, తాను పాకిస్ధాన్ సందర్శిస్తానని కోరగా, ‘ఇప్పుడు వద్దు’ అని నిరాకరించి, పాకిస్ధాన్ సంచలనం సృష్టించింది. పాకిస్ధాన్ కి చెందిన సీనియర్ అధికారి ఒకరి ఈ సంగతి వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఇది సూచిస్తోంది. రాయబారిని రావొద్దని కోరడానికి గల కారణాలను పాక్ అధికారి వివరించలేదు. “రాయబారి గ్రాస్‌మన్ పాకిస్ధాన్ సందర్శిస్తానని విజ్ఞప్తి చేశాడు. కాని ఈ సమయంలో ఆయన…

లాడెన్ ఆచూకి తెలిపిన పాక్ డాక్టర్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారి తీసేలా సి.ఐ.ఏ కి సమాచారం అందించిన పాకిస్ధాన్ డాక్టర్ పైన పాక్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒసామా బిన్ లాడెన్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్ధాన్ పానెల్ డాక్టర్ పై విద్రోహం కేసు నమోదు చెయాల్సిందిగా సలహా ఇచ్చింది. బూటకపు టీకా కార్యక్రమాన్ని రూపొందించి లాడెన్ ఆశ్రయం తీసుకుంటున్నాడని చెబుతున్న ఇంటిలో నివసిస్తున్నవారినుండి లాడెన్ కుటుంబ డి.ఎన్.ఎ సంపాదించాడని డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ షకీల్…

హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని…

మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…

పాక్‌కి అమెరికా సాయం నిలిపివేయడాన్ని ఆహ్వానించిన ఇండియా

పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ…

గూఢచారుల బహిష్కరణతో పాక్‌పై అమెరికా కక్ష సాధింపు, $800 మిలియన్ల సాయం నిలిపివేత

పాకిస్ధాన్‌లో వివిధ పేర్లతో పని చేస్తున్న సి.ఐ.ఏ సిబ్బందిలో మూడింట రెండో వంతు మందిని అమెరికాకి వెనక్కి పంపివేయడంతో అమెరికా పాకిస్ధాన్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో తమ సైనికులు పాల్గొంటున్నందుకు గాను పాకిస్ధా‌న్‌కి అమెరికా విడుదల చేయవలసి ఉన్న 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ సిబ్బంది ఉన్నతాధికారి  బిల్ డాలీ, ఎబిసి టెలివిజన్‌తో మాట్లాడుతూ “సహాయంలో కొంత భాగాన్ని నిలిపివేయడానికి దారి తీసేలా పాకిస్ధాన్ కొన్ని…