ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…