బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

కోతికి పదవిచ్చి, ఆనక కళ్ళూ నోరు మూసుకుని…. కార్టూన్

బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రధాన నేతలను చుట్టుముట్టినా ఏ ఉపద్రవమూ జరగని విపరీత పరిస్ధితి దేశంలో రాజ్యమేలుతోంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను గట్టెక్కించడానికి న్యాయ మంత్రి అశ్వని కుమార్ కోతి తరహాలో చేసిన ప్రయత్నం చివరికి వారికే ఎదురు తిరిగింది. అశ్వని కుమార్ అహంకార ధోరణితో గాయపడిన సి.బి.ఐ అధికారి ద్వారా కోర్టుకు సి.బి.ఐ సమర్పించిన నివేదికను కోర్టు కంటే ముందు ప్రభుత్వమే చూసి మార్పులు కూడా చేసిందని పత్రికలకు లీక్ కావడంతో యు.పి.ఏ…