బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని

భారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని…