భూములు దక్కించుకోడానికి పోలీసులతో అమీ తుమీకి సిద్ధమైన పోస్కో బాధితులు
దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి…