కాలుష్య ఫ్యాక్టరీపై చైనా గ్రామీణుల పోరాటం
తూర్పు చైనాలో వందలమంది గ్రామీణులు సోలర్ ప్యానెల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతుండడంతో ఫ్యాక్టరీని అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని హైనింగ్ పట్టణంలో ఉన్న ఝెజియాంగ్ జింకో సోలార్ కంపెనీ ఎదుట ఐదొందల వరకూ గ్రామీణులు గురువారం గుమిగూడి ఆందోళన ప్రారంబించారు. ఆందోళనకారుల్లో కొందరు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్ళి అక్కడ నిలిపి ఉన్న కంపెనీ కార్లను మూకుమ్ముడి బలంతో తిరగవేయడం, కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. కంపెనీకి సమీపంలో ఉన్న హాంగ్-గ్జియావో…