ఢిల్లీ కాలుష్యం: బేసి-సరి పధకం విజయవంతం! -ఫోటోలు
బి.జె.పి నేతల శాపనార్ధాలను వమ్ము చేస్తూ ఢిల్లీలో బేసి-సరి పధకం విజయవంతం అయింది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన రీతిలో తమ పధకానికి స్పందించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ దారి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాదని ప్రజలే దానిని సొంతం చేసుకున్నారని ప్రభుత్వం వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కలుషిత గాలి కలిగిన నగరంగా…

