తప్పుల తడక “మోస్ట్‌వాంటేడ్” పాకిస్ధానీయుల జాబితా ఉపసంహరించుకున్న ఇండియా

కొద్ది రోజుల క్రితం టెర్రరిజం నేరాల క్రింద భారత ప్రభుత్వం ప్రచురించిన “మోస్టు వాంటేడ్ పాకిస్తానీయుల” జాబితోలో తప్పులను భారత పత్రికలు ఎత్తి చూపడంతో ఆ జాబితాను ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పలేదు. టెర్రరిజం నేరాలము పాల్పడిన పాకిస్తానీయులను తమకు అప్పజెప్పాలంటూ 50 మంది పాకిస్తాన్ దేశీయుల పేర్లను ఇండియా గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించింది. కొద్ది రోజుల క్రితం ఆ జాబితాను తన వెబ్ సైట్ లో సి.బి.ఐ ఉంచింది. జాబితాలోని కనీసం ఒక…