అమీర్ ఖాన్: ఛీత్కారాలు, అభినందనలు!
సినిమాల్లో విజయవంతమైన కెరీర్ తో సరిపెట్టుకోకుండా, ‘సత్యమేవ జయతే’ పేరుతో టి.విలో కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనేకమంది భారతీయుల మన్ననలు అందుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‘పరమత సహనం/అసహనం’ పై దేశంలో చెలరేగిన రాజకీయ మరియు అరాచకీయ దుమారం నుండి దూరంగా నిలబడి తప్పించుకోవడానికి బదులు అటో, ఇటో ఒక మాట విసిరి తానూ ఉన్నానని నిరూపించుకునే సెలబ్రిటీలు చాలా తక్కువమందే. ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చినా కర్ర విరగ…
