పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం
(2000 సం.ము మార్చి 24-25 తేదీల మధ్య రాత్రి దినాన కాశ్మీర్ కు చెందిన 5గురు అమాయక యువకులు సైనికుల కరకు గుళ్ళకు బలై చనిపోయారు. వారు సీమాంతర ఉగ్రవాదులని సైన్యం దేశానికి చెప్పింది. కాదు వారు అనంత్ నాగ్ ఏరియా నివాసులని సి.బి.ఐ నిర్ధారించింది. సైన్యం AFSPA చట్టాన్ని కవచంగా తెచ్చుకోగా సుప్రీం కోర్టు సరేనంది. కోర్టు మార్షల్ అయినా చెయ్యాలంది. ఆ కోర్టు మార్షల్ మొన్న ముగిసింది. తమవాళ్లు తప్పు చేయలేదని నిర్ధారించి కేసు…
