ఎన్నికలయిపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? -పతంజలి

దీనిని పతంజలి, ఉదయం దినపత్రికలో, 29.12.1984 తేదీన రాశారంట. ఈ నాటి పరిస్ధితులకు కూడా ఇంకా ఎంత చక్కగా సరిపోయిందో చూడండి.: https://www.facebook.com/loknath.kovuru/posts/4175978093833 -తిరుపాలు ***          ***           ***          *** ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఒక ఆడకూతురిలా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది తీరని కోరికలతో లక్ష బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది…