‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

గిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు…