పంచశీల ఇప్పటికీ శిరోధార్యమే -చైనా

ఓ మృత శరీరాన్ని తట్టి లేపేందుకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. మరుపు పొరల్లో సమాధి అయిన పంచశీల సూత్రాలు ఇప్పటికీ శిరోధార్యమేనని చైనా అధ్యక్షుడు, భారత ఉపాధ్యక్షుడు బీజింగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చైనా, మియాన్మార్, ఇండియాలు కుదుర్చుకున్న పంచ శీల ఒప్పందానికి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఇరుగు పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఉద్దేశ్యం తమకు…