స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

సుప్రీం కోర్టు, హై కోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించి యు.పి.ఏ చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించేవైపుగా పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులకు, హై కోర్టులకు జడ్జిలను నియమించే అధికారం ప్రస్తుతం పూర్తిగా సుప్రీం చేతుల్లో లేదా న్యాయ వ్యవస్ధ చేతుల్లో ఉంది. దీనిని మార్చేవైపుగా ఎన్.డి.ఏ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది. ఫలితంగా యు.పి.ఏ పదేళ్ళలో చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించనుంది. నూతన ఆర్ధిక విధానాలలో భాగంగానూ, ప్రపంచ…