పీటముడిలో నేపాల్ ప్రజాస్వామ్యం -కార్టూన్
రాజ్యాంగ సభకు రెండో దఫా జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో యూనిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) పార్టీ ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. దానితో రాజ్యాంగ సభ ఎన్నికల ఫలితాలకు చట్టబద్ధత కొరవడే పరిస్ధితి ముంచుకొచ్చింది. మొదటి దఫా ఎన్నికల ద్వారా ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగ రచన పూర్తి చేయడంలో విఫలం కావడంతో రెండో దఫా రాజ్యాంగ సభ కోసం ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మొదటి దఫా ఎన్నికల్లో, ఎన్నికలు జరిగిన 250…
