ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?
హరీష్: ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు. సమాధానం: ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను…