అణు హిపోక్రసీ: అమెరికా పరీక్షలకు జపాన్, ఇరాన్ ఖండన
అణ్వస్త్రవ్యాప్తి నిరోధం గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా తాను మాత్రం అణు పరీక్షలను మానలేదు. సామూహిక విధ్వంసక మారణాయుధాలు కలిగి ఉన్నదంటూ ఇరాన్ దేశాన్నీ, ప్రజలనూ సర్వనాశనం చేయడమే కాక సిరియా, ఇరాన్ లకు కూడా అదే గతి పట్టించే కృషిలో నిమగ్నమై ఉన్న అమెరికా ఈ వారం నెవాడాలో అణు పరీక్షలు నిర్వహించినట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధంలో అమెరికా ద్వంద్వ విధానాన్నీ, హిపోక్రసీని జపాన్, ఇరాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.…
