రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా
నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు. భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న…
