గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…