నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు
భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…