జాతీయ స్ధాయి విలుకత్తెకి కానిస్టేబుల్ కొలువు కూడా ఇవ్వలేరా?

ఈ ఫోటోలో అమ్మాయి పేరు నిషా రాణి దత్తా. విలువిద్యలో జాతీయ స్ధాయి ప్రతిభ కనబరిచిన 21 యేళ్ళ యువతి. కటిక పేదరికంలో పుట్టినా స్వయం కృషితో విలువిద్య క్రీడలో జాతీయ స్ధాయికి చేరింది. అయినప్పటికీ ఈ జార్ఘండ్ ఆడకూతురికి కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఈ దేశ మూలవాసులయిన గిరిజన తెగల్లో పుట్టిన పాపానికి వృద్ధ తల్లిదండ్రులని, ఇద్దరు చెల్లెళ్లను పోషించుకోవడానికి తాను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న వెండి విల్లుని…