“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే
చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…