నేనున్నా లేకున్నా ఈ జ్యోతిని ఆరనివ్వకండి -తీహార్ వద్ద అన్నా
“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, ఉద్వేగభరితుడైన అన్నా హజారే అన్న మాటలివి. ఇంతకుమున్నెన్నడూ లేని రీతిలో ప్రజానీకం అన్నా హజారేను జైలునుండి వెలుపలికీ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో హాజరైనారు. మూడు రోజుల పాటు జైలులో గడిపిన హజారే, శక్తివంతమైన లోక్…