టెలికం (2జి) కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలు రాజీనామా చేయాలి -బి.జె.పి
మాజీ టెలికం మంత్రి ఎ.రాజా 2జి స్పెక్ట్రం లైసెన్సులను చౌకరేట్లకు జారీ చేసిన నిర్ణయంలో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పాత్ర కూడా ఉందనీ, వారికి తెలియకుండా ఏ నిర్ణయమూ జరిగే అవకాశం లేదనీ ఢిల్లీలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్న నేపధ్యంలో వారిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఫోన్‌ను ట్యాప్ చేయడం, అక్రమ మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక సి.ఎం…