హిందువుల కంటే నాస్తికులే ఎక్కువ!

నాస్తికులంటే … అదో తిట్టు పదంగా భావించినకాలముంది. దేవుడూ, భక్తీ, పూజలూ, మొక్కుబడులూ, స్తోత్రాలూ… వీటినిమారుమాటాడకుండా ఆమోదించాలనేమీ లేదనీ; వాటి ఉనికినీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించొచ్చనీ, అలా చేసే నాస్తికులు అనేవారు కూడా ఉంటారనీ- ఇదేమీతెలియని తరం ప్రస్తుతం ఉంది! ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ‘ఈనాడు’లో వచ్చిన ఒక వార్త విశేషంగా అనిపించింది! దీన్ని ఎంతమంది గమనించారో గానీ, దాని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాను. ”ప్రపంచంలో ఏ మతాన్నీ ఆచరించని వారు ఉన్నారు. ఏ మతాన్నీ ఆచరించనివారు…