“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు
నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…