మిన్స్క్ ఒప్పందాన్ని ఖాతరు చేయని ఉక్రెయిన్ -3

ఫిబ్రవరి 13 తేదికల్లా మరొవార్త. అమెరికా, రష్యా అధ్యక్షులు గంట పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఆ వార్త సారాంశం. బైడెన్ మళ్ళీ అదే పాట. “ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే అమెరికా మరిన్ని అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తుంది” అని. “రష్యా దాడి చేస్తే పశ్చిమ రాజ్యాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి” అనీను. పుతిన్ సమాధానం “రష్యా ఆందోళనలను పరిగణించడంలో అమెరికా విఫలం అవుతోంది” అని. “నాటో విస్తరణ పైనా, ఉక్రెయిన్ లో…

ఉక్రెయిన్: గ్యాస్ రాజకీయాలతో రష్యాకు హాని! -2

పైప్ లైన్ రాజకీయాలు ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు రష్యా బాల్టిక్ సముద్రం గుండా పైపు లైన్ ను రష్యా నిర్మించింది. ఈ పైపు లైన్ నిర్మాణ దశలోనే అమెరికా అనేక ఆటంకాలు కల్పించినప్పటికి నిర్మాణాన్ని రష్యా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పైపు లైన్ పేరు నార్డ్ స్ట్రీమ్ – 2. నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ను 2011లోనే రష్యా పూర్తి చేసింది. ఇది కూడా బాల్టిక్ సముద్రం గుండా రష్యా నుండి…

ఆధిపత్యం నిలుపుకునే ఆరాటంలో అమెరికా, బలిపశువు ఉక్రెయిన్!

కొన్ని నెలలుగా ఉక్రెయిన్ కేంద్రంగా అమెరికా రకరకాల యుద్ధ ప్రకటనలు చేస్తున్నది. రష్యా త్వరలో ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నట్లు గానూ, రష్యా దురాక్రమణ దాడి నుండి ఉక్రెయిన్ ను రక్షించడానికి తన నేతృత్వం లోని నాటో యుద్ధ కూటమి సిద్ధంగా ఉన్నట్లుగానూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఆయనతో పాటు ఇతర అమెరికా అధికారులు కూడా అనుబంధ ప్రకటనలు గుప్పిస్తూ రష్యాను ఒక రాక్షస దేశంగా, ఉక్రెయిన్ ఆ రాక్షసిని చూసి గజ…