సింగూరు తీర్పు: అభివృద్ధి వైరుధ్యం -3
ముందు ‘అభివృద్ధి వైరుధ్యం’ ఏమిటో స్పష్టంగా పరిశీలించాలి. ఒక జడ్జి దృష్టిలో “అసలు పారిశ్రామికీకరణ యొక్క లక్ష్యమే ప్రజలకు ఉపయోగపడడం.” చారిత్రక దృష్టితో చూసినప్పుడు ఈ అవగాహనలో తప్పు లేదు. కానీ జడ్జిలు చారిత్రక దృష్టి కలిగి ఉండటానికి చట్టాలు ఒప్పుకోవు. వారి ముందు ఉన్న కేసు, సాక్షాలు, చట్టాలు… ఈ అంశాలను మాత్రమే చూస్తూ వాళ్ళు తీర్పు ఇవ్వాలి. కనుక జడ్జి దృష్టిలో ఉన్నట్లు కనిపిస్తున్న చారిత్రకతను పక్కనబెట్టి సింగూరు భూముల స్వాధీనం – రైతుల…