నానో ఛిప్? సారీ! -ఆర్‌బిఐ
అదిగో పులి అనే వాడు ఒక్కడుంటే, ఇదిగో తోక అని వేల మంది కేకలు వేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ యుగంలో ఇది వేలం వెర్రి అయిపోయింది. ఎవరో ఏదో గొప్ప పని చేసేశారనీ, అదేదో అద్భుతం జరిగిపోతోందనీ, ఇంకేదో జరగరాని ఘొరం జరిగిపోయిందని ఒక బొమ్మ, ఒక చాత్రం (పిట్ట కధ)… ఎవరు పోస్ట్ చేసినా సరే, వెనకా ముందూ చూడకుండా షేర్ చేసెయ్యడం, బైట నలుగురికీ చెప్పి అబ్బురపరిచి తానూ అబ్బురపడిపోవడం…! పొద్దుట్నుంచి ఒకటే…
