తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…
