ఔషధాలపై అమెరికా ఆంక్షలు, భారత్ ఆందోళన
భారత ఔషధ కంపెనీలపై అమెరికా అలవిమాలిన ఆంక్షలు విధిస్తోంది. తనను తాను స్వేచ్ఛా వాణిజ్యానికి ఛాంపియన్ గా చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య సూత్రాల గొప్పతనం గురించి లెక్చర్లు దంచే అమెరికా ఆచరణలో అవలంబించేది మాత్రం అందుకు విరుద్ధమైన సూత్రాలు. భారత ఔషధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, భారతీయ కంపెనీలకు ఇటీవల కాలంలో వరుసగా భారీ జరిమానాలు విధించడం పట్ల ప్రభుత్వం ఆందోళన ప్రకటించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కమిషనర్…

