రక్షిస్తానని వచ్చి లిబియా పౌరులను భక్షించిన రోగ్ ‘నాటో’

ఆయుధ మదంతో అచ్చోసిన ఆంబోతులా ప్రపంచంలోని స్వతంత్ర దేశాలను కబళిస్తున్న నాటో, ‘మానవతా జోక్యం’ పేరుతో పశువులా తెగబడుతున్న వైనాన్ని ఐక్యరాజ్య సమితి నివేదికలు, మానవ హక్కుల సంస్ధలు ఈసడిస్తున్నాయి. గడ్డాఫీ బారినుండి లిబియా పౌరులను రక్షిస్తానంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న నాటో, వైమానిక బాంబు దాడులతో  వేలమంది పౌరుల్ని చంపేసి అంతర్జాతీయ సంస్ధల విచారణకు మోకాలడ్డుతోందని హార్ట్ ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ లో బోధిస్తున్న విజయ్ ప్రసాద్ ‘ది…

లిబియాలో నాటో హత్యాకాండ -గ్రాఫిక్స్‌తో వివరణ

అక్టోబరు 31 తో లిబియాపై నాటో యుద్ధం ముగిసినట్లుగా నాటో కూటమి ప్రకటించింది. యుద్ధం ముగిసింది కాబట్టి నాటో సైన్యాలు, గూఢచారులు లిబియా వదిలి పోతున్నాయనుకుంటే పొరబాటే. లిబియా జలాల్లో మొహరించిన నాటో దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు తమ పూర్వ ప్రాంతానికి వెళతాయని భావించినా పొరబాటే. ఎందుకంటె అవి అక్కడే, లిబియాపై దాడులు జరిగనంతకాలం ఎక్కడ ఉన్నాయో అక్కడే కొనసాగబోతున్నాయి. పైగా గూఢచారులు, సైనికులు మరింత స్వేచ్ఛగా బహిరంగంగా లిబియా నేలపైన సుదీర్ఘ…