ఉక్రెయిన్: ఆయుధ రహస్యాలు చైనాకు చేరుతున్నాయన్న బెంగలో అమెరికా!

ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి సరఫరా చేస్తున్న అమెరికా ఆయుధాలన్నీ రష్యా యుద్ధ ఎత్తుగడల ముందు ఎందుకూ పనికి రాకుండా విఫలం అవుతుండడంతో తమ ఆయుధాల రహస్యాలు రష్యాకు తెలిసిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. అంతకంటే ముఖ్యంగా తమ ఆయుధాల రహస్యాలను రష్యా, చైనాకు కూడా సరఫరా చేస్తున్నదని అనుమానిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల ఆయుధాల సమాచారం చైనాకు సరఫరా అవుతోందన్న అనుమానం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నది. అమెరికా మరియు…

ఉక్రెయిన్ లో నాటో సైన్యం, సమీపంలో WW-3?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం వరుస ఓటములు ఎదుర్కొంటోంది. రష్యా సైన్యం రోజు రోజుకీ ముందడుగు వేస్తున్నది. దీనితో అమెరికా గంగవెర్రులు ఎత్తుతోంది. ఉక్రెయిన్ కి ఓటమి తప్పదన్న భయం అమెరికాకి పట్టుకుంది. ఈ పరిస్ధితుల్లో నాటో కూటమి సైనికులు వివిధ రూపాల్లో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం ఎక్కువ అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి నాటో మిలటరీ కాంట్రాక్టర్లు మొదటి నుండి ఉక్రెయిన్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి సలహా, సూచనలు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.…

నమ్మించి దగా చెయ్యటం అమెరికా విద్య -కార్టూన్

కువైట్ దేశం చారిత్రకంగా ఇరాక్ లో భాగం. చమురు వాణిజ్యం విషయమై కువైట్ తో ఇరాక్ కి సమస్య వచ్చింది. చర్చలు జరిగాయి. కువైట్ వినలేదు. ఇక భరించ లేము. కువైట్ ని కలుపుకుంటాం అని సద్దాం అమెరికాకి చెప్పాడు. ఆ విషయం మాకు సంబంధం లేదు. అది మీ సమస్య అని అమెరికా చెప్పింది. సద్దాం అమెరికాని నమ్మాడు. కువైట్ లోకి సైన్యాన్ని నడిపాడు. అంతే. అమెరికా గావు కేకలు వేసింది. సద్దాం పై రెండు…

రష్యా మిలటరీ ఆపరేషన్ ఆపాలి -ఐరాస

రష్యా ఉక్రెయిన్ లో సాగిస్తున్న మిలట్రీ ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. 193 సభ్య దేశాలున్న ఐక్య రాజ్య సమితి (యూ‌ఎన్‌ఓ) జనరల్ అసెంబ్లీ బుధవారం జనరల్  అసెంబ్లీ సమావేశం జరిపింది. ఉక్రెయిన్ అంశం ఎజెండాగా అత్యవసర జనరల్ అసెంబ్లీ సమావేశం జరపాలా లేదా అన్న అంశంపై ఐరాస భద్రతా సమితి నిన్న ఓటింగ్ నిర్వహించింది. 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఓటింగ్ లో…

పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్

నాటో అంటే తెలిసిందేగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్! దీనికి అమెరికా నేత. నాటో కూటమిలో పేరుకు 28 సభ్య దేశాలు ఉన్నా, అమెరికా ఒక్కటే ఒకటి (1). మిగిలిన 27 దేశాలన్నీ ఆ ఒకటి పక్క సున్నాలే. అంటే ఏ రష్యాతో యుద్ధం అంటూ వస్తే బాంబులు అవీ తీసుకుని అమెరికా రావాలే తప్ప ఇతర దేశాలు రష్యా ముందు నిలవలేవు.  1990ల ఆరంభంలో సోవియట్ రష్యా కూలిన తర్వాత రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య…