నాటో దళాలపై తిరగబడ్డ ఆఫ్ఘన్ సైనికుడు, దాడిలో ఇద్దరి మరణం

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ సేనలపైన వారు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఆఫ్ఘన్ సైనికులే తిరగబడడం కొనసాగుతోంది. నాటో బలగాలను ఠారెత్తిస్తున్న ఇలాంటి దాడులు 2011 సంవత్సరంలో అమెరికా బలగాలకు తీవ్రం నష్టం చేకూర్చాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా తదితర నాటో దేశాల సైనికులకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం విశేషం. ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని నగరమైన కాబూల్, పష్తూనేతరులు నివసించే ఉత్తర రాష్ట్రాలు మిలిటెన్సీ తక్కువగా ఉన్న ప్రాంతాలనీ, భద్రమైన ప్రాంతాలనీ నాటో…