నాగాలాండ్ కూలీల హత్య: పార్లమెంటును తప్పుదారి పట్టించిన హోం మంత్రి?

14 మంది నాగాలాండ్ కూలీలను భారత భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయంలో హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కూలీలు వారు ప్రయాణిస్తున్న వాహనంలో భద్రతా బలగాల సంకేతాలను లెక్క చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనే సైనికులు కాల్పులు జరపవలసి వచ్చిందని మంత్రి రాజ్య సభలో చెప్పారు. దుర్ఘటనలో ప్రాణాలతో బైటపడిన కూలీలు చెబుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి…