పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం
పాలస్టీనియన్ హమాస్ రాకెట్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ నిరవధిక వాయుదాడులు ప్రారంభించిన దరిమిలా గాజాలో మృత్యువు మళ్ళీ విలయతాండవం చేస్తోంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (disproportionate) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది. హమాస్, 500 పైగా రాకెట్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ లో ఒక్క మరణమూ సంభవించలేదు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది (తాజా సంఖ్య 200 పైనే) పాలస్తీనీయులు ప్రాణాలు…