కేవలం కండోమ్‌లు పంచి సరిపెట్టుకోకుండా మాకు మా జీవితాల్నివ్వండి -నళిని
“కండోమ్‌లు పంచి పెట్టడంతోనే మీ భాధ్యత ముగిసిందనో, మా సమస్యలు తీరిపోతాయనో భావించడం సరికాదు. మా జీవితాల్ని మాకు తిరిగి ఇవ్వండి” అని కోరారు కేరళకు చెందిన రచయిత్రి, ఒకప్పటి సెక్స్ వర్కర్ నళిని జమీలా. సెక్స్ వర్కర్లకి సంబంధించి ప్రభుత్వ విధానాల పట్ల అనేక మంది సెక్స్ వర్కర్ల అభిప్రాయాలను నళిని ఒక్క వాక్యంలో విడమర్చి చెప్పింది నళిని. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంకి సంబంధించిన నాలుగవ పంచవర్ష ప్రణాళిక రూప కల్పన కోసం బెంగుళూరులో…